నెల్లూరు జిల్లాలో కావలి కాలువ కింద ఉండే మోటార్ల కనెక్షన్లు తొలగించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ విషయంలో అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తే ఊరుకోమని రైతులు అధికారులను హెచ్చరించారు. రైతలు అడ్డగింపుతో అధికారులు వెనుదిరిగారు. ఇటీవల రెండో పంటకు అధికారులు సోమశిల జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నాక... చివరికి నీరు అందడం లేదంటూ సంగం పరిసర ప్రాంతాల్లో ఉండే ఏడు గ్రామాల రైతుల మోటర్లను తొలగించేందుకు అధికారులు రావడం వల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి :