ETV Bharat / state

హామీలు కాగితాలకే పరిమితం... ఏళ్లుగా కర్షకులకు అందని పరిహారం - చౌటపల్లి గ్రామం తాజా వార్తలు

వారంతా సన్న, చిన్నకారు రైతులు. తమకున్న భూమిలో లక్షలు ఖర్చు చేసి నిమ్మ సాగు చేస్తున్నారు. ఓ కాలువ కారణంగా వారి పొలాలు ముంపునకు గురయ్యాయి. బాధిత రైతుల్లో 40 శాతం మందికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. మిగిలిన వారికి మాత్రం ఏళ్లు గడుస్తున్నా సాయం అందలేదు. మూడేళ్లుగా బాధిత రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం మాత్రం లభించడం లేదు.

dachuru village
dachuru village
author img

By

Published : Dec 10, 2020, 4:10 PM IST

హామీలు కాగితాలకే పరిమితం... ఏళ్లుగా కర్షకులకు అందని పరిహారం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కలువాయి మండలం దాచూరు, చౌటపల్లి గ్రామాలకు చెందిన సుమారు 60 ఎకరాల్లో నిమ్మ తోట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ గ్రామంలోని 100 ఎకరాల వ్యవసాయ భూములు కండలేరు కాలవ(చౌటపల్లి రిజర్వాయర్) ముంపు పొలాలుగా అధికారులు గుర్తించారు. రైతులకు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 41 ఎకరాలకు పరిహారం అందించిన అధికారులు... మిగిలిన 59 ఎకరాల పొలాలకు సుమారు పది కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవటంతో ఆ పొలాలకు సంబంధించిన 14 మంది రైతులు మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

కష్టం నీటి పాలు..

'రెండు గ్రామాల్లోని వివిధ సర్వే నంబర్లలోని 59 ఎకరాల పొలాలలో నిమ్మ, బత్తాయి, దానిమ్మ, టేకు చెట్లను లక్షలు రూపాయల పెట్టుబడితో సాగు చేస్తున్నాం. మా జీవనాధారమైన పొలాలు కండలేరు కాలువ నీటి ముంపునకు గురి అవుతున్నాయి. అధికారులు మా సమస్యను గుర్తించి ముంపు భూములుగా నమోదు చేసి పరిహారం ఇస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ సాయం మాత్రం అందలేదు. వరదల సమయంలో నెలల తరబడి నిమ్మ చెట్లు నీళ్లలోనే ఉంటున్నాయి. దీనివల్ల పంట చేతికి రావటం లేదు. పాచి కారణంగా మొక్కలు కూడా చనిపోతున్నాయి. వ్యవసాయ మోటర్లు నీట మునిగి లక్షలు రూపాయలు నష్టపోతున్నాం. సమస్యపై అన్ని రికార్డులను అధికారులకు అందజేశాం. కానీ అధికారులు సాయం చేస్తామంటూనే కాలం వెళ్లదీస్తున్నారు' అని రైతులు ఆవేదన వెలిబుచ్చారు.

ఇప్పటికైనా అధికారులు తమ సమస్యపై స్పందించాలని బాధిత కర్షకులు కోరుతున్నారు. ముంపునకు గురవుతున్న తమ పొలాలకు పరిహారం అందజేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.