ETV Bharat / state

జామాయిల్‌ రైతులకు దక్కని గిట్టుబాటు.. కోట్ల రూపాయలు పక్కదారి - ఆంద్రప్రదేశ్​లో జామాయిల్​ రైతులు

ఒకప్పుడు సిరులు కురిపించిన జామాయిల్‌ ధరలు.. నేడు రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. గిట్టుబాటు లేకపోవడంతో ఆ పంట సాగుకు క్రమేణా దూరమవుతున్నారు. దీనికి అనుబంధ పరిశ్రమలు మూతపడటంతో రాష్ట్రంలో ఒకే ఒక్క ప్లైవుడ్‌ కంపెనీకి కర్రను తోలుతున్నారు. ఆ సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో దళారులు సిండికేట్‌గా మారి ధరలను దిగ్గోస్తూ లాభాలను గద్దల్లా తన్నుకెళుతున్నారు. దీనిపై నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేక కథనం.

transport of jamail to company
జామాయిల్‌ కర్రలతో కంపెనీకి వెళుతున్న లారీ
author img

By

Published : Oct 12, 2020, 3:22 PM IST

రాష్ట్రంలో జామాయిల్‌ సాగు 1.5 లక్షల హెక్టార్లలో ఉంది. ఇందులో రాజమహేంద్రవరం తర్వాత, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు విస్తీర్ణంలో ముందున్నాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు దీని సాగుపై మక్కువ చూపుతున్నారు. గతంలో కర్ణాటక ప్రాంతాలకు కర్ర సరఫరా చేసే పరిస్థితి ఉండేది. తాజాగా చిత్తూరుజిల్లా తొట్టంబేడులో ఓ పరిశ్రమ జామాయిల్‌ కర్ర ముడిసరకుగా తీసుకుంటోంది. ఖాళీ భూముల్లో సాగు విపరీతంగా పెరిగింది.

వర్షపాతం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో హెక్టారుకు 70 నుంచి 80 టన్నులు దిగుబడి వస్తుండగా.. తక్కువ వర్షపాతం ప్రాంతాల్లో 40 నుంచి 50 మధ్యలో ఉంటోంది. కాగిత పరిశ్రమ బాగున్న రోజుల్లో టన్ను ధర రూ.4,200 పలికింది. రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జామాయిల్‌కు మంచి గిరాకీ ఉండేది. ప్రస్తుతం టన్ను రూ.2,500 కూడా లేకపోవడం గమనార్హం.ఆరేళ్ల పాటు కష్టపడి సాగు చేసే రైతులకు గిట్టుబాటు ఇవ్వని జామాయిల్‌ కర్ర.. దళారీలు, వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది.

రైతులకు టన్నుకు రూ.2,500 ఇస్తున్న దళారీలు దీన్ని పరిశ్రమకు రూ.2700 అమ్ముతున్నారు. దళారీకి టన్నుకు రూ.200 మిగులుతోంది. పరిశ్రమలో ఏడాది పొడవునా రోజూ దాదాపు 4 వేల టన్నులు కొనుగోలు జరుగుతోంది. అంటే రోజుకు దళారులు దోచేస్తోంది ఏకంగా రూ.8 లక్షలు. ఈమేరకు ఏడాదికి రూ.29 కోట్లకు పైనే జేబులో వేసుకుంటున్నారు.

రైతుల నోట్లో మట్టి : హెక్టారుకు దాదాపు 40 టన్నుల మేర దిగుబడి వస్తోందనుకుంటే రూ.లక్ష మేర ఆదాయం సమకూరుతుంది. తొలి పంట ఆరేళ్ల వరకు ఆగాల్సి ఉంది. ఏటా రూ.20 వేలు వ్యయం చేసినా రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. తొలి పంటలో మిగులు లేకపోగా రూ.20 వేలు నష్టపోతున్నారు. ఆ తర్వాత నుంచి పెట్టుబడి పెద్దగా లేకపోవడంతో అరకొరగా లాభం వచ్చే పరిస్థితి ఉండేది. తాజా పరిస్థితుల్లో అదీ ధరల పతనంతో పోయింది.

నష్టం రూ.248 కోట్లు : ఓ పరిశ్రమలో తయారయ్యే ఫ్లైవుడ్‌కు రెండు టన్నుల కర్ర ముడిసరకుగా అవసరం.. వీరికి కొనుగోలు ధర రూ.5,200 పడుతుంది. ఇలా రెండు టన్నుల ధర రూ.10,400 కాగా వీరికి బహిరంగ మార్కెట్లో ఇదే ఫైవుడ్‌ ధర టన్ను రూ.30 వేలు పలుకుతోంది. ప్రాసెసింగ్, ఇతర ఖర్చులు పోనూ పరిశ్రమకు దాదాపుగా రూ.15 వేలు టన్నుపై మిగులుతోంది. గతంతో పోల్చితే టన్నుపై రూ.1,700 తేడా ఉంది. ఏటా 14.60 లక్షల టన్నుల ముడిసరకు కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కన ఏటా రైతులు నష్టపోతున్నది రూ.248 కోట్లు.

జిల్లాలో రైతుల నుంచి దాదాపుగా స్టాండింగ్‌ క్రాప్‌ 2 లక్షల ఎకరాల మేరకు ఉంది. ఇవి కాకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో మనో 50 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. రైతులు నేరుగా దళారీలకు విక్రయించాల్సి వస్తోంది. అటవీ శాఖ టెండర్లు ద్వారా విక్రయిస్తుండగా అవకాశం ఉన్న సమయాల్లో దళారీలు స్థానిక కూలీలకు ఆశజూపి మొక్కలు కొట్టేస్తూ దుంగలను తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ తంతు గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.

ఇదీ చదవండి:

రాజధాని ప్రధాన పిటిషన్లపై దసరా తర్వాత విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.