ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని నెల్లూరు జిల్లా అనికేపల్లి రైతులు కోరారు. దాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ జిల్లా రెవెన్యూ అధికారి రమణకు అనికేపల్లి రైతులు వినతి పత్రం అందజేశారు. తాను ధాన్యం పండిస్తే, దళారులు వాటిని తీసుకొని నగదు అకౌంట్లో జమ చేస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసగించారని జైపాల్ అనే దళిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తానిచ్చిన ధాన్యం కాకుండా, 50 పుట్ల ధాన్యం తన పేరుతో ప్రభుత్వానికి అమ్మినట్లు పేపర్లలో వచ్చినా, నగదు మాత్రం అకౌంట్ లో జమ కాలేదన్నారు. తనలాగా ఎంతో మంది రైతులు మోసపోయారని, అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.
ఇవీ చూడండి...