ETV Bharat / state

Fake Votes in AP: ముందుకు సాగని ఓటర్ల జాబితా సవరణ సర్వే.. బీఎల్వోల ముందు సమస్యల చిట్టా.. - వైసీపీ నకిలీ ఓట్లు

Fake Votes in AP: నెల్లూరు జిల్లాలో సర్వర్ల సమస్య కారణంగా ఓటర్ల జాబితా సవరణ సర్వే ముందుకు సాగడంలేదు. దీన్ని అధికార పార్టీ అనుకూలంగా మార్చుకుని దొంగ ఓట్లను నమోదు చేసే పనిలో ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Fake_votes_in_ap
Fake_votes_in_ap
author img

By

Published : Aug 7, 2023, 2:06 PM IST

Fake Votes in AP: నెల్లూరు జిల్లాలోని అనేక మండలాల్లో సర్వర్ల సమస్య కారణంగా ఓటర్ల జాబితా సవరణ సర్వే ముందుకు సాగడంలేదు. ప్రక్రియ ఆలస్యం జరగడంతో అధికార పార్టీపై ప్రతిపక్షాల నాయకులకు పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సమస్య చూపిస్తూ బీఎల్వోలు యాప్​లో నమోదు చేయకుండా కాగితాల్లో రాసుకోవడం మరింత అనుమానాలకు తావిస్తుంది.

Fake votes: అనకాపల్లిలో ఓ ఇల్లు.. అందులో 280 ఓటర్లు..! వారందరు పంచాయితీ ఎన్నికల్లో ఓటేశారు..!

Voters Survey in AP: నెల్లూరు జిల్లాలో సున్నా నంబరు చిరునామాతో 75 వేల ఓట్లు ఉన్నాయి. ఒక్క ఇంటిలోనే 40 ఓట్లు ఉన్నాయి. ఆ ఇంట్లోని ముగ్గురు ఓట్లు వేరే వేరే బూత్​లలో ఉన్నాయి. మృతి చెందినవారి ఓట్లు ఇంకా అలానే ఉన్నాయి. ఇలా ఎన్నో సమస్యలు బీఎల్వోల ముందు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించకుండా కాగితాల్లో రాసుకుంటూ మమ అనిపిస్తున్నారు. నకిలీ ఓట్లను, మృతుల ఓట్లను కూడా తొలగించడం లేదు.

Fake votes: ఇల్లే లేదు.. అయినా 103 ఓట్లు.. అడ్డగోలుగా ఓటర్ల నమోదు

Fake Votes Hulchal in AP: ఆగస్టు 21న ఇంటింటి సర్వే ముగుస్తుంది. సర్వర్ సమస్యతో 50శాతం సర్వే కూడా బీఎల్వోలు పూర్తి చేయలేదు. గడువులోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ చర్యలేవి కనపడటం లేదు. బీఎల్వోల వెంట వాలంటీర్లు తిరగవద్దని ఎన్నికల కమిషన్ చెప్పినప్పటికీ కొన్నిచోట్ల తిరుగుతూనే ఉన్నారు. అర్హులకు ఓటు హక్కు కల్పించాలంటే స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ప్రజలతో కలసి సమైఖ్యంగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని
పిలుపునిస్తున్నారు.

"బాలాజీనగర్ 13వ డివిజన్​లో ఉంటాను నేను. మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. అయితే మాకు ఒకటే డోర్​ నంబర్లు ఉన్నప్పటికీ రకరకాల బూత్​లకు వేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా.. స్పందించట్లేదు."

"రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల నమోదు ప్రక్రియ చాలా దారుణంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చుకుంటున్నారు. ఇందులో వాలంటీర్లు భాగస్వాములవుతున్నారు. వీటితో పాటు ఆశ్చర్యంగా ఒక్కో ఇంట్లో 100, 200 ఓట్లు.. ఇలా ఒకే ఇంటి పేరుతో వందలాది ఓట్లను చేర్చుతున్నారు. సున్నా నంబరు చిరునామాతో వందలాది ఓట్లు ఉన్నాయి. ఉదాహరణకు మా ఆత్మకూరు నియోజక వర్గంలో ఒకే ఇంటిపేరుతో 105 ఓట్లు ఉన్నట్లు ఆర్డీఓ ఎంక్వయిరీలో తేలింది. నేను గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నాను.. కానీ ఓటర్ లిస్ట్ తయారీ ఎప్పుడూ ఇంత దారుణంగా జరగలేదు." - కర్నాటి ఆంజనేయ రెడ్డి, బీజేపీ

" నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటర్ల లిస్టులు పూర్తిగా తప్పులతడకలతో ఉన్నాయి. ఒక వార్డులో ఉండాల్సిన ఓట్లను తీసుకుని వచ్చి.. మరో వార్డులో చేర్చుతున్నారు. ఇలా 400 నుంచి 500 ఓట్లను జబ్లింగ్ చేస్తున్నారు. జీరో డోర్​ నంబరుతో వేల ఓట్లు ఉన్నాయి." - కత్తి శ్రీను, సీపీఎం

Telugu Desam Party fire on stolen votes: తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. భారీగా దొంగ ఓట్లు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.