ETV Bharat / state

కావలిలో నకిలీ ట్రైనీ ఐఏఎస్ అరెస్ట్​ - latest news in kavali

సాఫ్ట్ వేర్​ ఉద్యోగం చేస్తున్న అతడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఆశతో ట్రైనీ ఐఏఎస్​ని అంటూ.. పలువురిని మోసగించాడు. చివరికి... కటకటాలపాలయ్యాడు.

Fake trainee IAS
నకిలీ ఐఎఎస్​
author img

By

Published : Jun 24, 2021, 10:42 PM IST

నెల్లూరు జిల్లా కావలి మండలంలోని అన్నగారిపాలెం పంచాయతీలోని చిన్ననట్టు గ్రామానికి చెందిన వాయిల వెంకటేశ్వర్లు బీటెక్ వరకు చదువుకున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు ఐఏఎస్ అధికారిగా ఒక ఐడి కార్డు సృష్టించుకుని పలువురిని మోసగించసాగాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ మొబైల్ దుకాణంలో 35 వేల రూపాయల మొబైల్ కొనుగోలు చేసి నగదు లేవు చెక్కు ఇస్తానని చెప్పి నకిలీ చెక్కు ఇచ్చాడు. దుకాణం యజమాని బ్యాంకులో చెక్కు మార్చుకోటానికి వెళ్లి.. అందులో నగదు లేవని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి ఒక మొబైల్ ఫోను, నకిలీ ఐఏఎస్ ఐడీ కార్డు, బ్యాంకు పాస్ బుక్, చెక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ నేరాలు..

నిందితుడు గతంలోనూ ఎన్నో నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కావలి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో ఒంటరిగా వస్తున్న మహిళలను దారికాచి బంగారు ఆభరణాలు దొంగిలించేవాడని చెప్పారు. అలాగే రైల్వే టికెట్ కలెక్టర్ అని చెప్పి ప్రయాణికులను మోసం చేసి వారి వద్ద నుంచి నగదు తీసుకునేవాడన్నారు. ఇలా.. వైజాగ్, రాజమండ్రి ,నెల్లూరు, కావలి పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని తెలిసిందని చెప్పారు. ఇతని నేరచరిత్రపై మరింత దృష్టి పెట్టి మరిన్ని విషయాలు తెలుసుకుంటామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

Serial Killers: ఒంటరి వృద్ధులే లక్ష్యం.. వరుసగా ఆరు హత్యలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.