నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనంద్ కుమారి, సహాయ సంచాలకులు అనితను ఉద్యోగ సంఘం నాయకులు సన్మానించారు. పీఎం కిసాన్ ప్రజా సమస్యల పరిష్కారంలో నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
ఇందుకుగాను.. ఆ శాఖ అధికారులు పురస్కారం అందుకున్నారు. ఈ విషయమై హర్షం వ్యక్తం చేసిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరి కరుణాకర్ రెడ్డి.. అవార్డు అందుకున్న వారిని సన్మానించారు. రాష్ట్ర వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సోమసుందర్, ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: