నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శానిటైజర్ అమ్మకాలు జరిపే దుకాణాలపై ఎక్సైజ్ శాఖ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొందరు శానిటైజర్లు తాగి ఇటీవల రాష్ట్రంలో మరణాలు సంభవించడం వల్ల పట్టణంలో అమ్మే షాపులపై ఎక్సైజ్ సీఐ బాలకృష్ణ దాడులు చేశారు.
శానిటైజర్ కొనుగోలు చేసే వారి వివరాలు నమోదు చేసుకొని అనంతరం అమ్మాలని వ్యాపారులకు సీఐ చెప్పినట్లు వివరించారు. ప్రాణహాని ఉన్న శానిటైజర్లు ఎవ్వరూ తాగవద్దని మందుబాబులకు సూచించారు. దుకాణాల్లో కొన్ని నమూనాలను సేకరించారు.
ఇదీ చదవండి:
కురిచేడు ఘటన.. నిందితుడు చదివింది ఆరు.. చేసేది శానిటైజర్ల తయారీ..!