నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నేనిపల్లి వద్ద జామాయల్ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. జామాయిల్ తోటలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్‌కు గురైన లారీ.. అగ్ని ప్రమాదానికి గురయ్యింది. లారీ ట్రక్ భాగం, టైర్లు పూర్తిగా కాలిపోయాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో లారీలో ఉన్న ఐదుగురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
ఇదీ చదవండి:
ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ.. మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు