Irregularities In MLC Voters List : పట్టభద్రుల, టీచర్స్ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను మరొకసారి పరిశీలించాలని, తప్పులు, అక్రమాలు చోటు చేసుకున్నాయని నెల్లూరు జిల్లాలో తరచూ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కలెక్టర్‌కు ఎన్నికల కమిటీ కన్వీనర్ మోహన్‌రావు వినతిపత్రాలు అందజేశారు. ఓటర్ దరఖాస్తు, డిగ్రీ ధృవపత్రాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉంచాలని, పారదర్శకతను పాటించాలని కోరారు. వెయ్యి ఓట్లుపైన ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఒతిళ్లతో ప్రభుత్వం టీచర్ల దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరించారని తెలిపారు. డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల నుంచి వచ్చిన దరఖాస్తులు లెక్కకు మించి ఉన్నాయని, ఐఏఎస్ పరిశీలకుడిని నియమించి వాటిని పరిశీలించాలని కోరారు. జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థ యజమానులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఉన్నందున అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: