ETV Bharat / state

మృత్యువుతో పసికందు పోరాటం... సాయం కోసం ఎదురుచూపు - eight months child is facing severe problem in nellore

అసలే పేద కుటుంబం, రెక్కాడితే కాని డొక్కాడని పరిస్ధితి. కూలీ నాలీ చేస్తేనే సాయంత్రానికి కూడు, లేదంటే పస్తులే. అలాంటిది ఆ కుటుంబాన్ని మరో సమస్య వెంటాడుతోంది. తమకున్న మూడెకరాల పొలం అమ్మేసుకొని తమ ఎనిమిది నెలల కుమారుడికి గుండె శస్త్రచికిత్స చేయించారు. చేసిన ఆపరేషన్ విఫలం కావడంతో దిక్కుతోచని పరిస్ధితిలో ఉన్న ఆ నిరుపేద తల్లిదండ్రులు వారి కుమారుడిని ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

మృత్యువుతో పసికందు పోరాటం
మృత్యువుతో పసికందు పోరాటం
author img

By

Published : Oct 20, 2020, 3:42 PM IST

Updated : Oct 20, 2020, 5:49 PM IST

మృత్యువుతో పోరాడుతున్న 8నెలల పసికందు... సాయం కోసం ఎదురు చూపులు

వారిది నిరుపేద కుటుంబం. కూలీ చేస్తే కానీ వారి పొట్ట నిండదు. తమకున్న పొలాన్నంత అమ్మకుని తమ ఎనిమిది నెలల కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు శస్త్రచికిత్స చేశారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి గ్రామానికి చెందిన దేవల్ల శ్రీనివాసులు, సుప్రజ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ బాబుకు గుండె సంబంధిత సమస్య రావడంతో తమకున్న మూడెకరాల పొలం అమ్మి ఆ రూ.5లక్షలతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించారు. ఇక తమ బిడ్డకు ప్రాణాపాయం తప్పిందని ఆ తల్లిదండ్రలు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. రెండు నెలల్లోనే తిరిగి హాస్పిటల్​కు చెకప్​కు వెళ్లగా ఆపరేషన్ ఫెయిల్ అయిందని వైద్యులు తెలిపారు. తిరిగి నెలరోజుల్లో రీ ఆపరేషన్ చేయకుంటే బాబు ప్రాణాలకే ముప్పని... శస్త్రచికిత్సకు మరో రూ.3లక్షలు ఖర్చువుతుందని వైద్యులు తెలిపారు.

రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి రీ ఆపరేషన్​ కోసం డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థంకాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దయ గల దాతలు స్పందించి సహాయం అందించి తమ బాబు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

కళ్లెదుటే కుమారుడి మృతదేహం...ఏమీ చేయలేని స్థితిలో మాతృహృదయం

Last Updated : Oct 20, 2020, 5:49 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.