ETV Bharat / state

'బతుకు'లేక బడి పంతులు.. అరటి పండ్లు అమ్ముతున్నాడు! - nellore dst teachers news

బతకలేక బడి పంతులు అనేది గతం... బడి పంతులు బతికేలా లేడు అనేది ప్రస్తుతం. ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయుడిగా జీవనం సాగిస్తోన్న ఆ వ్యక్తిని కరోనా మహమ్మారి రోడ్డెక్కించింది. పాఠాలు చెప్పిన గురువే... ఈరోజు బేరాలాడుతూ పండ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా వేదాయపాళెం ప్రాంతంలో ఉంటోన్న వెంకటసుబ్బయ్యపై లాక్ డౌన్ ఏవిధంగా ప్రభావం చూపిందో మీరూ చూడండి.

due to corona effect a teacher selling fruits for his family in nellore dst

author img

By

Published : Jun 6, 2020, 6:05 PM IST

Updated : Jun 7, 2020, 12:16 AM IST

బోర్డుపై అక్షరాలు దిద్దిన ఆ చేతులు.. రోడ్డుపై.. తోపుడు బండిని తోస్తున్నాయి. అ, ఆ లు చెప్పిన ఆ నోరు.. అరటి పండ్లు.. అరటి పండ్లు.. అని అరుస్తోంది. గతం ఏదైనా.. ఇప్పుడు బతుకు ముఖ్యమనుకుని బడి పంతులు రోడ్డుపై అరటి పండ్లు అమ్మె పరిస్థితి. కరోనా ప్రభావానికి.. ఇలా రోడ్డుపైకి వచ్చిన ఉన్నత విద్యావంతులెందరో కదా! ఒక్కసారి ఆ బడి పంతులు వెంకటసుబ్బయ్య గురించి తెలుసుకుందాం.

నెల్లూరు నగరం వేదాయపాళెం ప్రాంతంలో వెంకటసుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు ఎం.ఏ. తెలుగు, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, డీఈడీ పూర్తి చేశాడు. నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన తన కుమారుడి వైద్యం కోసం... దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పు చేసినా, తనకొచ్చే జీతంతో అన్ని కట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.

ఈ క్రమంలో లాక్​డౌన్ కారణంగా ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి దయనీయంగా మారింది. విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొంతకాలం ఆన్​లైన్ ద్వారా వెంకటసుబ్బయ్యతో క్లాసులు చెప్పించారు. కొత్త విద్యార్థులను చేర్పించాలనే టార్గెట్ చేరుకోలేకపోవటంతో... ఆ విద్యాసంస్థ ఆయనను పక్కన పెట్టింది. దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్న ఆ ఉపాధ్యాయుడు... చివరకు తోపుడు బండిపై అరటిపండ్లు అమ్మటం ప్రారంభించాడు.

గాంధీనగర్ రోడ్డులో బండిపై అరటి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎంతో మంది ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి ఇలాగే ఉందని... ప్రభుత్వమే ఎలాగైనా తమని ఆదుకోవాలని వెంకటసుబ్బయ్య కోరుతున్నారు.

ఇదీ చూడండి

అలిపిరిలో థర్మో స్కానర్లు.. పరిమిత సంఖ్యలో దర్శనానికి భక్తులు

Last Updated : Jun 7, 2020, 12:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.