నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ వైద్యుల తీరు విమర్శలకు దారి తీసింది. పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు డాక్టర్లు ప్రతిమ, శ్రీనివాసుల రెడ్డి సెలవుపై వెళ్లటంతో ఉన్నతాధికారులు రోగులకు చికిత్స అందించేందుకు జూనియర్ డాక్టర్లకు విధులు కేటాయించారు. అయితే ఉదయం 10 గంటల నుంచి విధులు నిర్వహించాల్సిన జూనియర్ డాక్టర్లు... ఆసుపత్రి ప్రాంగణంలో బంతి ఆట ఆడుకున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది చూసిన జనాలు విస్తుపోయి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: