నెల్లూరులోని 25వ డివిజన్ వాసులకు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించి 40 రోజులు అవుతున్నందున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి లాక్డౌన్ నిబంధనను పాటించి, వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.
ఇదీచదవండి.