నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్గా దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తెనాలి సబ్ కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ ను నెల్లూరు కమిషనర్ గా నియమించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలువురు ఉద్యోగులు కమిషనర్ కు అభినందనలు తెలియజేశారు. అందరి సహకారంతో నగర పాలక సంస్థను అభివృద్ధి చేస్తానని దినేష్ కుమార్ ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్పొరేషన్ ను అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని వెల్లడించారు.
ఇవీ చదవండి: పాత సామానుల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్