నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో చేనేత కార్మికులు ధర్నా చేపట్టారు. వర్షాలు, వరదలకు మగ్గాల్లోకి నీరు చేరి తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. లాక్డౌన్తో కష్టాలపాలైన చేనేత కార్మికులను, వర్షాలు మరింత కుంగదీశాయని తెదేపా, సీపీఎం నాయకులు తెలిపారు. నష్టపోయిన చేనేత కార్మికులకు తక్షణమే ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి 30కేజీల బియ్యం, రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. మగ్గాలు, పనిముట్లు దెబ్బతిన్న కార్మికులకు రూ.30వేలు అందజేయాలని కోరారు.
ఇదీ చదవండి: