ETV Bharat / state

'రామమందిరం నిర్మాణం ప్రతి భారతీయడి కల'

author img

By

Published : Aug 5, 2020, 5:56 PM IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా నెల్లూరులోని ప్రజలు సంతోషం చేశారు. అయోధ్య కరసేవలో పాల్గొన్న పలువురిని సన్మానించారు. గూడూరు పట్టణంలో ఆర్​​ఎస్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

devotees of srirama  prayers at nellore
నెల్లూరులో రామ పూజలు

అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా నెల్లూరులోని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు జరిగాయి. నగరంలోని ట్రంక్ రోడ్డు వద్ద తాత్కాలికంగా శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించారు. కొన్నేళ్ల క్రితం జరిగిన అయోధ్య కరసేవలో పాల్గొన్న పలువురికి సన్మానం చేశారు. కరసేవలో పాల్గొనడం తమ అదృష్టమని వారు అలనాటి స్మృతులను గుర్తు చేస్తున్నారు. హిందువుల ఎన్నో ఏళ్ల కల అయిన రామమందిర నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని విహెచ్​పి నేత మెంటా రామ్మోహన్ అన్నారు.

గూడూరు పట్టణంలో అయోధ్యలో రామ మందిరం భూమి పూజ సందర్బంగా పట్టణంలోని ఆర్ఎస్​ఎస్ కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచి... టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సంగం థియేటర్ సెంటర్​లో భాజాపా నాయకులు టపాకాయలు కాల్చారు. ఈ రోజు భారతదేశ చరిత్రలో చరిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని నాయకులు అన్నారు. ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని అన్నారు . రామ మందిర నిర్మాణం ప్రతి భారతీయుడి కల అని...ప్రధాని నరేంద్రమోదీ ఆ కలను నెరవేర్చారని అన్నారు.

ఇదీ చదవండి. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా రామాలయ నిర్మాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.