ETV Bharat / politics

జగన్​ ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశాడు - ఇప్పుడు మతాల్ని కించపరుస్తున్నాడు: సోమిరెడ్డి - MLA SOMIREDDY FIRES ON JAGAN - MLA SOMIREDDY FIRES ON JAGAN

MLA Somireddy Chandramohan Reddy Fires on Jagan: దేశాన్ని, మతాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్‌కి మతి చలించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇదేం దేశం అంటావా? అయితే సౌదీ అరేబియా లేదా దుబాయ్​కి వెళ్లిపో అని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి, హిందువులకు జగన్​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

MLA SOMIREDDY FIRE ON JAGAN
MLA SOMIREDDY FIRE ON JAGAN (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 4:48 PM IST

MLA Somireddy Chandramohan Reddy Fires on Jagan : దేశాన్ని, మతాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్‌కు మతి చలించిందని టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్‌ ఇప్పుడు దేశాన్ని, మతాల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదేం దేశం అంటావా? అని దుయ్యబట్టారు. అయితే సౌది అరేబియా లేదా దుబాయ్​కో వెళ్లిపో అని హితవు పలికారు. తిరుమలలో డిక్లరేషన్​పై సంతకం చేస్తే భారతి ఇంట్లోని రానివ్వదని జగన్​ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లేకపోతే క్రైస్తవ ఓట్లు పోతాయని తిరుమల పర్యటన రద్దు చేసుకున్నావా అని నిలదీశారు.

దేశాన్ని, మతాన్ని, తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు జగన్​కు ఉందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ తన కన్నతల్లి, చెల్లినీ దూరం చేసుకున్నాడని విమర్శించారు. అసలు జగన్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పుంగనూరుకు, మిథున్ రెడ్డి రాజంపేటకు వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారు. కొడాలినాని, వంశీ, రోజాలు నియోజకవర్గాలకు కాదు కదా కనీసం వారి జిల్లాలకు పోలేకపోతున్నారని విమర్శించారు. సజ్జల, ధనుంజయ్ రెడ్డిలది అయితే అజ్ఞాతవాసమేనని ఎద్దేవా చేశారు.

'ఇదేం దేశం అంటావా? సౌది అరేబియా లేదా దుబాయ్‌కి వెళ్లిపో జగన్​' (ETV Bharat)

దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్‌ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు? : హోంమంత్రి అనిత - Home Minister Comments On Jagan

ఇప్పుడు జగన్ తాను పుట్టిన రాయలసీమలోని తిరుపతికి పోలేకపోయాడని దుయ్యబట్టారు. అసలు జగన్​కు​ రాజకీయ నాయకుడినని చెప్పుకోవడానికి అర్హత లేని ధ్వజమెత్తారు. ఇప్పుడైనా జగన్​ దేశానికి, రాష్ట్రానికి, హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి పెద్ద వ్యక్తులే అఫడవిట్‌ ఇచ్చారు - Political Parties Fire on YS Jagan

శ్రీవారిని దర్శించుకోవాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati on Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.