ఈ గ్రామంలో ఎటు చూసినా విష జ్వరాలే... ఏ ఇంటి తలువుతట్టినా మృత్యువాతలే. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాత బిట్రగుంట గ్రామంలో నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఇది. గ్రామంలో 750 నివాసాలు, 4500 మంది జనాభా ఉన్నారు. విషజ్వరాలు, డెంగీ లక్షణాలతో గ్రామంలో కొందరు నివసిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరికొందరు చికిత్స కోసం నెల్లూరు, చెన్నై వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి వ్యాధులు గ్రామాన్ని చుట్టుముట్టాయని గ్రామస్థులు అంటున్నారు. ఇంత ఇబ్బందులు పడుతున్నా... ఒక్క ఉన్నతాధికారైనా బిట్రగుంటలో పర్యటించి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తగు నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి :