నెల్లూరు జిల్లా సంగం వద్ద జాతీయ రహదారిపై కొండను తవ్వి నెల్లూరు టూ కడప రోడ్డుని నిర్మించారు. వర్షం వచ్చినప్పుడల్లా కొండ చరియలు విరిగిపడి రోడ్డు మీద పడుతున్నాయి.దీంతో వర్షాకాలంలో ఆ రహదారి పై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు కొండ చరియలు విరిగి పడకుండా రక్షణగా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరారు.
ఇదీ చూడండి