ETV Bharat / state

లభ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలని సీపీఎం ఆందోళన - cpm protest at nellore district news update

పూర్తయిన ఇళ్ళను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని సీపీఎం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు రూరల్ మండలంలోని అక్కచెరువుపాడు గ్రామం దగ్గర నిర్మించిన ఇళ్ల వద్ద పూజలు నిర్వహించారు.

CPM protest to give houses
లభ్దిదారులకు ఇళ్లు ఇవ్వాలని సీపీఎం ఆందోళన
author img

By

Published : Oct 20, 2020, 6:03 PM IST

హౌస్ ఫర్ ఆల్ ఇళ్లను లబ్ధిదారులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం చేపట్టిన ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు రూరల్ మండలంలోని అక్కచెరువుపాడు గ్రామం దగ్గర నిర్మించిన ఇళ్ల వద్ద సింహపురి పట్టణ పౌర సమాఖ్య ఆధ్వర్యంలో సీపీఎం నేతలు నిరసన తెలిపారు. లబ్ధిదారులతో కలిసి హౌసింగ్ అపార్ట్​మెంట్ వద్ద పూజలు నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఇళ్లను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయాల కోసం.. లబ్ధిదారులకు అన్యాయం చేస్తోందని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు.

ఇవీ చూడండి...

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.