కరోనా కాలంలో అధిక ఖర్చులు వెచ్చింది ధాన్యాన్ని పండించిన రైతులకు.. ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర కల్పించాలని నెల్లూరు జిల్లా కొవడలుూరులో సీపీఎం నేతలు ఆందోళన చేపట్టారు.
ప్రకృతి సహకరించక దిగుబడి తగ్గి, చేతికొచ్చిన పంటను తక్కువ ధరకు అమ్ముకుంటూ రైతన్నలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆ పార్టీ నేత దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, అక్కడ నామమాత్రంగానే కొనుగోలు జరుగుతున్నాయని... కొనుగోలు కేంద్రాల్లోనూ లేనిపోని నిబంధనలు విధించడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.
తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యమంటూ తక్కువ ధరకే రైతులు తమ పంటలను అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: