నెల్లూరులో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున అన్ని జిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
రైతులకు నష్టం కలిగించేలా ఉన్న కొత్త చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళారులే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. పంపుసెట్లకు మీటర్లు బిగించే విధానం సరైనది కాదన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చి.. రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పటం వైకాపాకే దక్కిందని విమర్శించారు.
ఇదీ చదవండి:
'ఎవరు కాపాడుతారు నిన్ను?'... నెల్లూరు జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే వార్నింగ్