నెల్లూరు జిల్లాలో మొత్తం నాలుగు ప్రాంతాల్లో కొవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ పకడ్బందీగా జరిగింది. నగరంలోని నారాయణ ఆస్పత్రితో పాటు క్రాంతి నగర్, వరిగొండ పీహెచ్సీలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగింది. ఒక్కోచోట దాదాపు 30 మందికి వ్యాక్సినేషన్ ట్రయల్ నిర్వహించారు. కలెక్టర్ చక్రధర బాబు వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. మొదటి విడతలో దాదాపు 32వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
వ్యాక్సిన్ వేయించుకునే వారికి సంక్షిప్త సమాచారం ఇచ్చి.. కేంద్రానికి వచ్చిన వారి వివరాలను అంతర్జాలంలో సరి చూసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఏమైనా ఇబ్బందులు వస్తే తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి సూచించారు. నారాయణ హాస్పిటల్ వద్ద సర్వర్ సమస్య తలెత్తి.. వ్యాక్సిన్ వేయకముందే అంతర్జాలంలో ప్రక్రియ పూర్తైందని వచ్చింది. అధికారులు దాన్ని సరి చేసే పనిలో పడ్డారు.
ఇదీ చదవండి: