ETV Bharat / state

కరుణాకర్‌ ఆత్మహత్య కేసు..ఇద్దరు అరెస్ట్​, 14 రోజుల రిమాండ్​ - కరుణాకర్‌ ఆత్మహత్య కేసు

Karunakar Suicide Case: నెల్లూరు జిల్లా కావలిలో దళిత యువకుడు కరుణాకర్‌ ఆత్మహత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్​ చేశారు. నిందితులు జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిలను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్​ విధించారు.

sucide
sucide
author img

By

Published : Sep 2, 2022, 8:44 PM IST

Karunakar Suicide Case: నెల్లూరు జిల్లా కావలి దళిత యువకుడు కరుణాకర్‌ ఆత్మహత్య కేసులో... నిందితులు జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిలకు కోర్టు రిమాండ్ విధించింది. వైకాపా నేతల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు కరుణాకర్‌ రాసిన లేఖ ఆధారంగా... పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు నిందితుల్ని కావలి సబ్ జైలుకి తరలించారు.

అసలేం జరిగింది: నెల్లూరు జిల్లా కావలిలో వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై కరుణాకర్​ ఆగస్టు 20న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్‌(36) చేపల చెరువును సబ్‌ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.

Police case file ఈసారి వర్షాలు కురిసేలోపే చేపలు పట్టి విక్రయించాలని భావించగా, ముసునూరుకు చెందిన అధికార పార్టీ నాయకులు అడ్డుకున్నారు. శ్రీశైలం ట్రస్టుబోర్డు సభ్యుడు, వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పదేపదే అడ్డుకోవడంతో పాటు గత నెలలో చెరువులో మందు కలపడంతో పెద్దఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. తీవ్ర ఒత్తిడికి లోనైన కరుణాకర్‌ అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజాప్రతినిధులు, అధికారులను కలసి సమస్య వివరించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేదు. అప్పులెలా చెల్లించాలన్న ఒత్తిడి తట్టుకోలేక కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి కారణమైన వారి వేధింపులతో పాటు, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీకి సూసైడ్‌ నోట్‌ రాశాడు. కరుణాకర్‌ ఆత్మహత్యపై జగదీశ్వర్‌రెడ్డి, సురేశ్‌రెడ్డిలపై కావలి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఐపీసీ 306 సెక్షన్ల కేసు నమోదైంది. ఎస్పీ విజయరావు ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ ఖాజావలి ఘటనాస్థలికి చేరుకొని విచారించారు.

కరుణాకర్‌ రాసిన ఆత్మహత్య లేఖ.. చదివిన వారిని కంటతడి పెట్టించింది.

‘ఆయ్యా.. అన్నగారిపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామ మత్య్సకారులకు రిజిస్టరైన చెరువులను సబ్‌ లీజుకు తీసుకొని చేప పిల్లలు పోసి, పెరిగిన తర్వాత అమ్ముకుంటున్నా. మా గ్రామానికి చెందిన కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి, అతని అనుచరుడు సురేశ్‌రెడ్డి మరికొందరు నేను చేపలు పట్టకుండా ఇబ్బందులకు గురిచేశారు. అప్పులపాలు చేశారు. దళితుడినని చూడకుండా మూడేళ్లుగా వేధించారు. నేను, నా తల్లి అతని ఇంటికి వెళ్లి కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. నాకిద్దరు ఆడ పిల్లలున్నారని చెప్పినా విన్లేదు. ఓపిక లేక ఆత్మహత్య చేసుకుంటున్నా. దీనికి కారణమైన వారిని అరెస్టు చేసి, నా కుటుంబానికి న్యాయం చేయండి. నాకు ఉన్న ఆస్తి ఇల్లు మాత్రమే. అదీ తాకట్టులో ఉంది. అది విడిపించి ఆడబిడ్డలకు ఇవ్వాలి’ -కరుణాకర్​ సూసైడ్​ నోట్​

ఇవి కూడా చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.