ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో టీకా పంపిణీ.. సాంకేతిక కారణాలతో ఆలస్యం - టీకా వార్తలు

నెల్లూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ చక్రధర బాబు వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించగా మొదటగా ప్రశాంతి అనే నర్సుకు వ్యాక్సిన్ వేశారు. జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల ప్రజా ప్రతినిధులు కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా మెుదలైంది.

corona vaccination in nellore district
నెల్లూరు జిల్లాలో టీకా పంపిణీ
author img

By

Published : Jan 16, 2021, 7:12 PM IST

నెల్లూరు జీజీహెచ్​లో కరోనీ టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రారంభించారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా 26 కేంద్రాల్లో.. 29వేల మంది లబ్ధిదారులకు దీనిని అందించనున్నారు. రోజుకు 2600 మందికి.. 130 మంది సిబ్బంది టీకా ఇస్తారు. జిల్లాలోని 26 టీకా కేంద్రాల్లో.. రోజుకు ఒక్కొక్క కేంద్రంలో 100 మందికి అందించే విధంగా ఆరోగ్యశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 16 ఐఎల్ఆర్ యూనిట్లలో వ్యాక్సిన్​ను నిల్వ ఉంచారు. 50వేల డోసులు నిల్వ సామర్ధ్యం కలిగిన మూడు భారీ ఫీజర్లను ఇందుకోసం వినియోగిస్తున్నారు.

నెల్లూరు నగరంలో..

నెల్లూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ చక్రధర బాబు వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా ప్రశాంతి అనే నర్సుకు వ్యాక్సిన్ వేశారు. జిల్లాకు 38,500 వ్యాక్సినేషన్ డోసులు రాగా, వ్యాక్సిన్ వేసేందుకు 26 కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారి నియమించారు. ప్రతి కేంద్రంలో నిత్యం వంద మందికి వ్యాక్సిన్ వేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని అనుమతులు పొందిన తర్వాతే ప్రభుత్వం వ్యాక్సిన్ విడుదల చేసిందని.. ఇది ఎంతో సురక్షితమైందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్ అందించే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. మొదటి దశ పూర్తి అయిన వెంటనే రెండో దశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 665 కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్​పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. వ్యాక్సిన్ వేస్తుకున్న వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. .

నెల్లూరు జీజీహెచ్​లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశీలించారు. అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి స్వదేశీ టీకాపై భయం వీడి.. ప్రతి ఒక్కరూ వాక్సిన్​ను తీసుకోవాలని మంత్రి సూచించారు. బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలలో పెరిగిన సాంకేతికత వల్ల ప్రపంచానికే టీకా అందించే స్థాయికి భారత్​ ఎదగగలిగిందని హర్షం వ్యక్తం చేశారు.

నాయుడుపేటలో..

నాయుడుపేట సామాజిక ఆ‌రోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేరుకోగా.. సాంకేతిక కారణాల వల్ల ఆన్​లైన్​లో పేర్లు నమోదు కాక 11.30 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. సాంకేతిక సమస్య పరిష్కారమయ్యాక టీకా ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది.

ఉదయగిరిలో..

ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం, నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఏర్పాట్లను పరిశీలించారు.

కరోనా వ్యాక్సిన్ వేసుకునే లబ్ధిదారులు టీకా వేయించుకుని కరోనా మహమ్మారి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలన్నారు. సాంకేతిక కారణాల వల్ల వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ఆలస్యమైంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో తొలి విడత వ్యాక్సినేషన్.. మెుదటి టీకా ఆమెకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.