నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కరోనా పాజిటివ్ వచ్చిన వారి పరిస్దితి రోజురోజుకి దారుణంగా తయారవుతుంది. కనీస సౌకర్యాలు లేక రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పాజిటివ్ వచ్చిన వారి కోసం జిల్లా ఆసుపత్రి, టిట్కోలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఉదయం ఎస్‌పేట మండల కేంద్రం నుంచి పాజిటివ్ వచ్చిన అయిదుగురు బాధితులను 108లో ఆత్మకూరు టిట్కోలోని ఐసోలేషన్ వార్డుకి తరలించారు. కానీ అక్కడ గదులు లేవంటూ..వారిని అంబులెన్స్‌లోనే ఉంచారు. ఐసోలెషన్ వార్డుల్లో పడకలు, గదులు లేనప్పుడు మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తరలించారని బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఇదీచదవండి