ETV Bharat / state

ఆటో చక్రం తిరగక.. ఆగిన బతుకు చక్రం

author img

By

Published : Jun 5, 2021, 7:35 AM IST

రోజంతా ఆటో తిప్పితేనే వాళ్ల చేతికి డబ్బులొస్తాయి. ఆటో చక్రం తిరిగితేనే.. కుటుంబానికి రోజు గడుస్తుంది. ప్రయాణికులు లేక, పూట గడవక.. ఆటో డ్రైవర్లు ప్రస్తుతం బేల చూపులు చూస్తున్నారు. కరోనా కాలంలో కర్ఫ్యూ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆటో డ్రైవర్లు.

ఆటో చక్రం తిరగక.. ఆగిన బతుకు చక్రం
ఆటో చక్రం తిరగక.. ఆగిన బతుకు చక్రం
ఆటో చక్రం తిరగక.. ఆగిన బతుకు చక్రం

కరోనా వల్ల అన్ని రంగాల కార్మికులూ ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం మరీ అధ్వానంగా తయారైంది. రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ మూలంగా పెట్టిన కర్ఫ్యూ ఆంక్షల వల్ల.. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. ఆటోల్లో ఒకరు, ఇద్దరు ప్రయాణికులే ప్రయాణిస్తుండడంతో.. అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

నెల్లూరు జిల్లాలో దాదాపు 50 వేలకు పైగా ఆటోలు ఉండగా.. ఒక్క నెల్లూరు నగరంలోనే 30 వేలు తిరుగుతున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, కావలి, ఆత్మకూరు పట్టణాల్లో మరో 20 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఆటోల ద్వారా కొన్ని వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. అలాంటి ఆటో డ్రైవర్లు పరిస్థితి.. కరోనా కర్ఫ్యూ కారణంగా ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది. మధ్యాహ్నం వరకే ఆటోలు తిరిగేందుకు అనుమతి ఉండడంతో.. రోజుకు 200 వందల రూపాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు. డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరగిపోయాయని..కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారిందని...ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు పూటలు తినడానికే నానా అవస్థలు పడుతున్నామని, ఇంటి అద్దె కూడా కట్టుకోలేకపోతున్నామని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోల ఫైనాన్స్‌ కూడా కట్టలేక.. దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. వాపోతున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉందని.. ప్రభుత్వమే ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: టీకా వృథాను అరికట్టాలి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.