నెల్లూరు జిల్లా కావలి దగ్గర శేషాద్రి ఎక్స్ప్రెస్లో కిడ్నాపైన రెండు నెలల చిన్నారి కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. మూడు రోజులుగా పోలీసులు సీసీ ఫుటేజీ, ఫోన్ సిగ్నల్స్ పరిశీలించి పాపను ఎత్తుకెళ్లిన మహిళలను నూజివీడులో పట్టుకున్నారు. పాపను నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు ఆనందానికి అవధులు లేవు.
ఇదీ చదవండి: వృద్ధురాలిని ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి