నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కమ్మవారిపల్లిలో పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చంద్రయ్య అనే వ్యక్తి.. తన 8 ఎకరాలలో వరి పైరు వేసి సాగు చేస్తుండగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ట్రాక్టర్‌తో పొలంలో దౌర్జన్యంగా వరిపైరును ధ్వంసం చేశారు. అడ్డుకున్న పొలం యజమాని చంద్రయ్య, రమేష్‌పై ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచదవండి