ETV Bharat / state

ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

author img

By

Published : Feb 20, 2021, 5:06 PM IST

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

కలెక్టర్
ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు డివిజన్ పరిధిలో జరగనున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. కొడవలూరు, కోవూరు మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. మూడు విడతల్లో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఏలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

డివిజన్ పరిధిలో 55పంచాయతీలు ఏకగ్రీవంకాగా, 181 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, దాదాపు 5.33 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వర్షం పడినా పోలింగ్​కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో, ఈ సారి కౌంటింగ్​కు ప్రతి వార్డుకు ఓ టేబుల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రతి 500మందికి ఓ టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు.

వర్షంలో తడిసిన బ్యాలెట్ బాక్సులు..

నెల్లూరు డివిజన్ పరిధిలోని కోవూరులో అకాల వర్షం కారణంగా బ్యాలెట్ బాక్సులు తడిచి ముద్దయ్యాయి. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షంతో బ్యాలెట్ బాక్సులు తడిచిపోగా, వాటిని కాపాడుకునేందుకు ఎన్నికల సిబ్బంది అవస్థలు పడాల్సి వచ్చింది.

ఇదీ చదవండి: మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం ఖాయం: మంత్రి అనిల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.