ETV Bharat / state

వర్షాలు తగ్గగానే వరద నష్టంపై మదింపు: సీఎం జగన్​ - ఏపీలో నివర్ తుపాను సహాయక చర్యలు

భారీ వర్షాల వల్ల ఏదైన నష్టం సంభవిస్తే సత్వరమే సహాయం చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. నివర్‌ తుపాను ప్రభావంపై సీఎంవో అధికారులతో సమీక్షించిన ఆయన... పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

CM jagan review on the impact of Nivar storm
నివర్​ తుపాను ప్రభావంపై సీఎం జగన్​ సమీక్ష
author img

By

Published : Nov 26, 2020, 12:36 PM IST

నివర్‌ తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావ ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుపాను ప్రభావం, వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని తెలిపారు. తుపాను తీవ్రత తగ్గతోందన్నారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని వివరించారు. కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రికి తెలిపారు.

పెన్నాలో ప్రవాహం ఉండొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని సీఎంకు తెలియజేశారు. అక్కడక్కడా పంటలు నీటమునిగాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతంతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం జగన్​ ఆదేశించారు. పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని సీఎం అన్నారు.

ఇదీ చదవండి: తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.