MLA Anil kumar Yadav comments: ఇటీవల నెల్లూరు జీజీహెచ్ వైద్యశాల వద్ద డిప్యూటీ మేయర్ రూప్ కుమార్.. ఎమ్మెల్యే అనిల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజులు తరువాత నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అనిల్ భారీ సభను నిర్వహించారు. బాబాయి రూప్ కుమార్ విమర్శలను తిప్పికొట్టారు. పార్టీ మారుతున్నాననే ప్రచారం మానుకోండి.. మళ్లీ ఫైర్ బ్రాండ్లా దూసుకుపోతానని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు. రాత్రి తాగి మాట్లవద్దని, నాకు సినిమా చూపిస్తానని చెప్పిన ఆయన రావాలని సవాల్ విసిరారు. నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్‌పై కూడా విరుచుకుపడ్డారు.
- ALSO READ: సీఎం రాజీ కుదిర్చినా.. ఆగని ఆరోపణలు, దాడులు
కొంత కాలంగా నెల్లూరు నగరానికి దూరంగా ఉన్న నగర ఎమ్మెల్యే ఇటీవల జరిగిన పరిణామాలను వివరించేందుకు భారీ సభను నిర్వహించారు. రూప్ కుమార్ యాదవ్ అనుచరుడిపై దాడి చేయించింది.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ అని నెల రోజుల కిందట విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులు ఎమ్మెల్యే అనిల్ నగరంలో లేరు. రూప్ కుమార్ విమర్శలను తిప్పికొడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కొన్ని కారణాల వల్ల నగరానికి దూరంగా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. మళ్లీ ఫైర్ బ్రాండ్ లా మారతానని. విమర్శించే వారిని ఢీకొంటానని హెచ్చరించారు. సింహంలా కనిపిస్తేనే గౌరవిస్తారని తెలుసుకున్నానని.. అవసరమైతే రొమ్ములు చీలుస్తానని ఆవేశంగా మాట్లాడారు. రాత్రి తాగి అనిల్‌ని ఓడిస్తానని.. పగలు జగన్జై అని పలకడం కాదు.. దైర్యం ఉంటే ఎదురుగా వచ్చి పోరాటం చేయాలని ఆ పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గానికి సవాల్ విసిరారు. నేను జగన్‌కు మిలిటెంట్ స్వాడ్ లాంటి వాడిని. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీని వీడే ప్రసక్తే లేదు.
వైఎస్సార్సీపీ తరపున పోటీలో నేను తప్ప ఎవరూ ఉండరు.. 2024లో అనిల్ బుల్లెట్ ట్రైన్‌లా ఉంటాడు. ఎవరు అడ్డు వచ్చినా గుద్దేస్తా. సిటీ నియోజక వర్గంలోని ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు తన వెనుక గోతులు తవ్వుతున్నారు. వీరిద్దరూ బాహుబలి, బల్లాల దేవుడిలా ఫీలవుతున్నారు. ఓ రాజమాతను సిటీ నియోజకవర్గంలో పోటీ చేయించాలని తహతహ లాడుతున్నారు. ఇలాంటి నాయకులు ఎన్నికల్లో నాకు సహాయం చేస్తారంటే నమ్మాలా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నంత కాలం తనతో ఉన్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. జగన్‌కు వీరవిథేయుడినని చెప్పారు. నెల్లూరు నగరం నుంచి నేను తప్పా వైఎస్సార్సీపీ తరపున ఎవరూ పోటీలో ఉండరని చెప్పారు. అంత ధైర్యం ఎవరూ చేయరని ప్రకటించారు.