అకాల వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా నాయుడుపాలెం, పెల్లకూరు మిరప రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న అకాల వర్షంతో పంట పొలాల్లోనే నీరు నిలిచి ఉంది. దీనివల్ల మిరప పంట దెబ్బతింటోంది. వర్షం తగ్గకపోవటం... వాన నీరు పొలాల నుంచి బయటకు పోకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర ఎకరా మిరపపంట సాగుకు 15 వేల వరకు ఖర్చు అవుతుందనీ... నివర్ తుపాను వల్ల నష్టపోయిన పంటకు కూడా ఇప్పటి వరకు పరిహారం అందలేదని రైతులు వాపోయారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి.. తమను ఆదుకోవాలని అన్నదాతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: అన్నదాతల ఆశలపై... నీళ్లు చిమ్మిన అకాల వర్షం