తన్నేరు మురళి.. జలవనరుల శాఖలో నాలుగో తరగతి ఉద్యోగి. లస్కర్ గా పనిచేస్తూ రైతులకు సాగునీరు అందించే విషయంలో విధులు నిర్వహిస్తుంటారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన.. రోజూ వందమందికి సరిపడా ఆహారాన్ని ఇంట్లోనే తయారుచేసి పేదలకు పంపిణీ చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన సుబ్బరాజు కుటుంబం.. గుడ్డతో మాస్క్లు తయారు చేస్తూ అందరికీ ఉచితంగా అందిస్తున్నారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం 12 ఎంపీటీసీల పరిధిలో కేజీ బియ్యం పెరుగు ప్యాకెట్ కూరగాయలు ఎర్రగడ్డ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పంపిణీ చేశారు. కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పంచాయతీలో అంటువ్యాధులు ప్రబలకుండా వినియోగించే హైడ్రో క్లోరైడ్ ద్రావకాన్ని ఒక పర్యాయం పిచికారి చేసేందుకు ప్రత్యేకంగా యంత్రాలను సమకూర్చారు.
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని ఈదుల బలపురం గ్రామానికి చెందిన నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు అందరికీ శ్రీరామనవమి సందర్భంగా పండుగ సరుకులు పంపిణీ చేశారు. నాలుగు కిలోల బియ్యం, కిలో బెల్లం, కిలో మైదా, కిలో వంటనూనె, కిలో కందిపప్పు అందజేశారు.
ఇదీ చూడండి: