ETV Bharat / state

'సొమ్మొకడిది.. సోకొకడిది'.. నెల్లూరులో కెనరా బ్యాంకు ఉద్యోగి దోపిడీ

Bank Employee Fraud in Nellore District: నెల్లూరు జిల్లాలో ఓ బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. బ్యాంకులో బంగారు నగల రుణాలు ఇచ్చే విభాగంలో పనిచేసే ఉద్యోగి భాస్కర్.. బంగారు నగలు పెట్టి రుణాలు పొందిన పలువురికి.. తక్కువ నగదు ఇచ్చి మిగిలిన డబ్బులను స్వాహా చేశాడు. రుణాలు కట్టినవారివి.. రెన్యువల్ చేయకుండా నగదును కొట్టేసినట్టు సమాచారం.

author img

By

Published : Mar 20, 2023, 7:35 PM IST

Updated : Mar 21, 2023, 3:07 PM IST

Bank Employee Fraud
బ్యాంకు ఉద్యోగి మోసం

Bank Employee Fraud in Nellore District: నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని కెనరా బ్యాంక్​లోని ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. బంగారు నగలుపై రుణాలు తీసుకునే ఖాతాదారుల నగదును దోచేశాడు. బ్యాంకులో బంగారు నగల రుణాలు ఇచ్చే విభాగంలో పనిచేసే ఉద్యోగి భాస్కర్.. ఖాతాదారులు తెచ్చే నగలను తూకం వేసి నగదు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో బ్యాంకులో బంగారు నగలు పెట్టి రుణాలు పొందిన పలువురికి.. తక్కువ నగదు ఇచ్చి మిగిలిన డబ్బులను భాస్కర్ స్వాహా చేసేశాడని గుర్తించారు.

ఉద్యోగి భాస్కర్ వ్యవహారాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు మొత్తం 600 మందికి నోటీసులు జారి చేయగా.. ఇప్పటివరకు 130 మంది వడ్డీ కట్టి రెన్యువల్ చేసినవారి.. వడ్డీ డబ్బును బ్యాంక్​లో జమ చేయకుండా కాజేసినట్లు గుర్తించారు. లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సుమారు రూ.50 లక్షల మేర కాజేసినట్లు తెలుస్తోది. దీంతో హుటాహుటిన బ్యాంకు వద్దకు చేరుకున్న ఖాతాదారులు తమకు జరిగిన అన్యాయంపై బ్యాంకు అధికారులను నిలదీశారు. తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులు ఎత్తేయడంతో బ్యాంకు వద్ద వారు ఆందోళనకు దిగారు. ఖాతాదారుల నగదును కొట్టేసిన ఉద్యోగి భాస్కర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఉద్యోగి గతంలోనూ ఖాతాదారులతో కుమ్మక్కై నకిలీ బంగారు నగలను బ్యాంకులో పెట్టి రుణాలు ఇచ్చినట్లుగా గుర్తించారు. ఈ అవకతవకలపై బ్యాంక్ సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగి మోసం.. బాధితుల ఆందోళన

"కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన.. ఈ బ్యాంకులో మేము గోల్డ్ పెట్టుకున్నాం సర్. సంవత్సరం తరువాత వడ్డీ కట్టమని ఫోన్ చేశారు. మేము వచ్చి వడ్డీ కట్టినాము. ఆల్రెడీ లోన్ అకౌంటికి యాడ్ అయింది. కానీ వాళ్లు రెన్యువల్ చేయలేదు. కనీసం నోటీసు కూడా పంపించలేదు. ఈ రోజు వచ్చి లోన్ అమౌంట్ మొత్తం కట్టమని అంటున్నారు". - బాధితుడు

"రెన్యువల్ అని చెప్పేసి.. 130 మందిని పక్కన పెట్టేసి.. వడ్డీ డబ్బులు అతను కట్టకుండా తినేశాడు. అధికారులేమో.. రికవర్ చేస్తాం అంటున్నారు. 130 మంది అని అంటున్నారు.. ఎంతమంది ఉన్నారో తేల్చాలి. ఆల్రెడీ రోల్డ్ గోల్డ్ కూడా పెట్టేసి.. కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నారు". - బాధితుడు

"నా ఇద్దరి బిడ్డల ఫీజు కట్టుకోవడానికి అని నా గాజులు పెట్టి.. 40 వేలు తీసుకున్నాను. ఇప్పుడేమో లక్షా పదివేలు కట్టమని అంటున్నారు. నేను ఈ రోజు.. తీసుకున్న డబ్బులు, వడ్డీ కట్టేద్దామని డబ్బులు తీసుకొని వచ్చినాను సర్.. నా గాజులు తీసుకుందాం అని. నేను మూడు నెలల ముందే తీసుకున్నాను". - బాధితురాలు

"ఫిబ్రవరిలో మేము చెక్ చేసుకున్నప్పుడు ఒక రెన్యువల్ మిస్ అయింది. అప్పుడు అప్రైసల్​ని అడిగినప్పుడు.. ఒక పాత బీరువాలో నుంచి ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చాడు. ఎందుకు అక్కడ నుంచి తీసుకొని వస్తున్నావ్ అంటే.. రెన్యువల్ అయిపోయింది సర్ అన్నాడు. మాకు డౌట్ వచ్చి.. సంవత్సరం దాటి ఉన్నవారందరికీ నోటీసులు పంపించాం. 600 మందికి నోటీసులు పంపించాం. ఎంత మంది ఉన్నారో ఇంకా తెలీదు". - బ్యాంకు ఉద్యోగి

ఇవీ చదవండి:

Last Updated : Mar 21, 2023, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.