ETV Bharat / state

నెల్లూరు నగరంలో బాలుడి కిడ్నాప్​కు యత్నం - nellore district latest news

నెల్లూరు నగరంలో బాలుడి కిడ్నాప్​కు యత్నించడం కలకలం రేపింది. ఇద్దరు కిడ్నాప్​కు ప్రయత్నించగా... స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

nellore district crime news
నెల్లూరులో కిడ్నాప్ కలకలం
author img

By

Published : Sep 4, 2020, 3:40 PM IST

నెల్లూరులో ఓ బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. నగరంలోని మాగుంట లేఅవుట్ ప్రాంతంలో పన్నెండేళ్ల బాలుడు ఆడుకుంటుండగా.. రాత్రి బైక్​పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం చేశారు. బాలుడిని బలవంతంగా లాక్కునిపోయేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించిన స్థానికులు.. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు, మరొకరు పరారయ్యారు. స్థానికంగా నివాసం ఉండే నరేష్​కుమార్ కుమారుడు అక్షిత్​ను కిడ్నాప్ చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఈ కిడ్నాప్ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్​కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ… సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.