నెల్లూరు జిల్లా మర్రిపాడు పట్టణంలో చిల్లర దుకాణం ఎదుట ముగ్గు వేసి అందులో.. నిమ్మకాయలతో క్షుద్ర పూజ చేసినట్టుగా కనిపించిన దృశ్యం.. స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. షాపు యజమాని పది గంటలకు.. దుకాణాన్ని మూసి ఇంటికి వెళ్లారు.
ఉదయాన్నే చూడగా.. ఆ ప్రాంతంలో ముగ్గులు, నిమ్మకాయలు పెట్టి ఉన్నాయి. భయాందోళనకు గురైన దుకాణదారుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: