సీఏఏకు మద్దతుగా నెల్లూరులో భాజపా భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు. నగరంలోని చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు నుంచి చిల్డ్రన్స్ పార్క్, రామలింగాపురం, మద్రాసు బస్టాండ్ మీుదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకూ ర్యాలీ జరిగింది. సీఏఏతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతకముందు కస్తూరిదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో డాక్టర్ దీన్ దయాళ్ ముఖర్జీ.. 52వ వర్థంతి సందర్భంగా ఆయనకు కన్నా లక్ష్మీనారాయణ నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ సమావేశంలో.. భాజపానేత భరత్ కుమార్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఇదీ చదవండి: