నెల్లూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ కూడలిలో భాజపా నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న పక్కా గృహాలను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్నామంటూ చెప్పే మాటలు.. ఆచరణలో కనిపించడం లేదని భాజపా రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యుడు రోశయ్య ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న పక్కా గృహాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసి పేదలకు కేటాయించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఓబీసీ అధ్యక్షుడు వెంకటాద్రి పాల్గొన్నారు.
ఇవీ చూడండి...