నెల్లూరు జిల్లా అనంతసారం మండలం సోమశిలలో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. హిందూ దేవాలయ ఆస్తులకు రక్షణ కల్పించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోమశిల సోమేశ్వర ఆలయంలో పట్టపగలే వినాయకుడి విగ్రహం దొంగలించి నెలలు గడుస్తున్నా కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోందన్నారు. ఈ ఘటనపై స్థానిక మంత్రి స్పందించకపోవటమేంటని నిలదీశారు. అంతర్వేది రథం దగ్ధం కావటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనీ.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విరేచనాలు అవుతున్నాయని ఆస్పత్రిలో చేరితే...రూ. 5.50 లక్షల బిల్లు!