ఆత్మకూరు ఉపఎన్నికల్లో తన భర్త భాజపా ఏజంట్‌గా ఉన్నందుకు వైకాపా నేత ఉడతా హజరత్తయ్య.. తనను బలవంతంగా తీసుకెళ్లి నిర్భందించి.. చిత్రహింసలకు గురి చేసినట్లు భాజపా సానుభూతిపరురాలు పద్దమ్మ ఆరోపించారు. ఈ మేరకు హజరత్తయ్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పద్దమ్మను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫోన్‌లో పరామర్శించారు. దాడి కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ విషయంను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పద్దమ్మకు భాజపా అండగా ఉంటుందన్నారు.
ఆత్మకూరు ఉపఎన్నిక రోజున చేజర్ల మండలం గొల్లపల్లిలో పద్దమ్మ భర్త ఆదినారాయణ .. భాజపా ఏజంట్‌గా పనిచేశారు. అది మనసులో పెట్టుకుని ఎన్నికలయ్యాక తమపై దాడి చేశాడని పద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ఆ అనుభవం ఎలా ఉంటుందో చూపించారు: అవికా గోర్
MOHAN BABU: 'పిలిచారు.. వచ్చాను.. సంతకం పెట్టాను.. వెళ్లిపోతున్నా'- మోహన్‌బాబు