నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్లోకి వెళ్లేందుకు వచ్చిన వందల లారీలను రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. భారీ ఇసుక వాహనాలు బ్రిడ్జిపై వెళ్తున్నందున.. అది కూలిపోయే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆ వాహనాల కారణంగా తాము పొలాల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రెండు రోజుల్లో ప్రత్యామ్నాయం చూసుకోకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు