ETV Bharat / state

'అమరావతి రైతుల ఉద్యమానికి బీసీలు మద్దతు ఇవ్వాలి' - అమరావతి రైతుల ఉద్యమానికి బీసీలు మద్దతు

రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగడం లేదని బీసీ సంక్షేమ సంఘం ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రావాల్సిన 34 శాతం రిజర్వేషన్లపై ఏ పార్టీ నోరుమెదపడం లేదని విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమానికి బీసీలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

bc welfare society meeting
బీసీ సంక్షేమ సంఘం సమావేశం
author img

By

Published : Dec 28, 2020, 8:44 PM IST

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టిన బీసీలకు మాత్రం న్యాయం జరగడం లేదని బీసీ సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రావాల్సిన 34 శాతం రిజర్వేషన్లపై ఏ పార్టీ నోరుమెదపడం లేదని ఆ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్ విమర్శించారు. నెల్లూరులో జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో బీసీలంతా ఐక్యమైతేనే రిజర్వేషన్లతోపాటు రాజకీయ ప్రాధాన్యం లభిస్తుందని క్రాంతికుమార్ తెలిపారు. అమరావతి రైతుల ఉద్యమానికి బీసీలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ సంఘం నేత నాగేశ్వరావు యాదవ్ పిలుపునిచ్చారు. రాజధాని అమరావతిలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ఇదీ చదవండి :

'సానుభూతి కోసం సీఎం జగన్ ప్రయత్నాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.