ETV Bharat / state

కరోనా ప్రభావం.. అకాల వర్షం.. అరటి రైతుకు నష్టం - banana farmers agitation

ఓ వైపు కరోనా ప్రభావం.. మరోవైపు అకాల వర్షం నెల్లూరు జిల్లాలో అరటి రైతులను కష్టాల్లోకి నెట్టింది. చేతికొచ్చిన పంట అమ్ముకోలేక కర్షకులు కన్నీరు పెడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలయ్యామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

అరటి రైతులకు అకాల కష్టాలు
అరటి రైతులకు అకాల కష్టాలు
author img

By

Published : Apr 16, 2020, 11:18 AM IST

అరటి రైతులకు అకాల కష్టాలు

నెల్లూరు జిల్లాలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా అరటిని రైతులు సాగు చేశారు. ఇక్కడ పండించిన పంటను చెన్నైకి తరలించేవారు. ప్రస్తుతం లాక్​డౌన్​ కొనసాగుతుండటం వల్ల రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. దీని వల్ల పంట అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా ప్రభావం.. మరోవైపు ఇటీవల కురిసిన అకాల వర్షాలు తమను నష్టాల్లోకి నెట్టాయని వాపోయారు. పంట రవాణా లేక అరటి పొలాల్లోనే కుళ్లిపోతుందని కన్నీరు పెడుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

లక్షలు పెట్టుబడి పెట్టి అరటి సాగు చేశామని.. చివరకి ఫలితం చేతికందే సమయానికి తమను కరోనా.. అకాల వర్షం పూర్తిగా కోలుకోలేని దెబ్బతీశాయని రైతులు వాపోయారు. వేరే దిక్కు తోచక కొంతమంది రోడ్లపైనే పండ్లను అమ్ముకుంటున్నారు. మరికొంత మంది ఆటోలపై ఇతర గ్రామాల్లో తిరిగి అమ్మకాలు జరుపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు

రైతులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ తెలిపారు. పండించిన పంటను అమ్ముకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు.

ఇదీ చూడండి:

భారీ వర్షాలతో నేల రాలిన మామిడి, అరటి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.