నెల్లూరు జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పక్కాగా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ(డీఆర్సీ) సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకు సంబంధించి ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత మరోసారి డీఆర్సీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
'రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు' - మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వార్తలు
నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. అన్నదాతలు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.