నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాఘవులు అనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడన్న సమాచారంతో సంగం మండలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న కుటుంబ సభ్యులు రాఘవులు మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు. అనుమానస్పద మృతిగా తొలుత భావించిన పోలీసులు రాఘవులు మెడపై, గొంతు పై తీవ్ర గాయాలు గమనించి హత్య జరిగినట్టుగా నిర్ధారించుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తి పై అనుమానం ఉన్నందున అతని ద్వారా పూర్తి వివరాలను సేకరించి ఈ కేసులో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఆటో డ్రైవర్ దారుణ హత్య - నెల్లూరు జిల్లాలో డ్రైవర్ దారుణ హత్య
నెల్లూరు జిల్లా వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాఘవులు అనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందాడన్న సమాచారంతో సంగం మండలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న కుటుంబ సభ్యులు రాఘవులు మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు. అనుమానస్పద మృతిగా తొలుత భావించిన పోలీసులు రాఘవులు మెడపై, గొంతు పై తీవ్ర గాయాలు గమనించి హత్య జరిగినట్టుగా నిర్ధారించుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తి పై అనుమానం ఉన్నందున అతని ద్వారా పూర్తి వివరాలను సేకరించి ఈ కేసులో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి:నెల్లూరులో రాష్ట్రస్థాయి కరాటే పోటీలు
TAGGED:
ఆటో డ్రైవర్ దారుణ హత్య