ETV Bharat / state

వాలంటీర్​ పై దాడి... ముగ్గురిపై కేసు నమోదు - nellore district latest crime news

ఆత్మకూరు మండలం బసవరాజుపాళెంలో వాలంటీర్‌పై ముగ్గురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. చెన్నై నుంచి గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని వాలంటీర్ తన పైఅధికారులకు అందించాడు. ఉన్నతాధికారులకు ఎందుకు చెప్పావంటూ వాలంటీర్‌పై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆత్మకూరు మండలంలో వాలంటీర్​ పై దాడి
ఆత్మకూరు మండలంలో వాలంటీర్​ పై దాడి
author img

By

Published : Jun 9, 2020, 6:06 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు‌ మండలం బసవరాజుపాళెంలో దీపోగు వెంకటరమణయ్య ఇంటికి చెన్నై నుంచి బంధువులు వచ్చారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల చెన్నై నుంచి వచ్చిన వారి సమాచారాన్ని అక్కడి వాలంటీర్​ మస్తానయ్య... పైఅధికారులకు సమాచారం అందించాడు. వెంకటరమణయ్యకు అధికారులు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. వెంటనే ఆ గ్రామాన్ని అధికారులు కంటైన్‌మెంట్​ జోన్​గా ప్రకటించారు.

రెండు రోజుల తర్వాత మరోసారి అతనికి పరీక్ష చేయగా నెగిటివ్​ రావటంతో ఇంటికి పంపించారు. అప్పటి నుంచి వాలంటీర్​ మీద వెంకటరమణయ్య కక్ష పెంచుకున్నాడు. మేము ఎక్కడి నుంచి వస్తే నీకెందుకంటూ... వాలంటీర్​పై వెంకటరమణయ్య అతని బంధువులతో కలిసి దాడి చేశాడు. తనపై దాడికి పాల్పడిన వారిపై వాలంటీర్​ మస్తానయ్య... ఉన్నఅధికారులకు తెలియజేశాడు. ఈ ముగ్గురి మీద పోలీస్​​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.