ETV Bharat / state

ప్రేమ జంటపై దాడి... యువతి నోట్లో పురుగుమందు పోసిన కుటుంబసభ్యులు - attack on newly married couple

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో యువతిపై ఆమె కుటుంబసభ్యులే దాడి చేశారు. ఆపై యువతి నోట్లో పురుగుల మందు పోశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంగసానిపల్లి సమీపంలో జరిగింది.

attack on couple
యువతి నోట్లో పురుగుమందు పోసిన కుటుంబసభ్యులు
author img

By

Published : Mar 9, 2021, 6:02 PM IST

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో యువతి కుటుంబసభ్యులు ఆటోలో వెళ్తున్న ప్రేమజంటపై దాడి చేశారు. యువతి నోట్లో పురుగుమందు పోశారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సంగసానిపల్లి సమీపంలో జరిగింది.

దాడికి సంబంధించిన వివరాలు చెబుతున్న యువతి

యువతి తెలిపిన వివరాల ప్రకారం..

సీతారామపురం మండలం సింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ, దేవమ్మ చెరువు గ్రామానికి చెందిన అనిత నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన జంట.. ఈ నెల 5వ తేదీన అహోబిలం పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకున్నారు. తమ కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు అనిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారన్న విషయం తెలుసుకుని.. ప్రేమ జంటే పోలీసులకు ఫోన్​ చేశారు.

ఆళ్లగడ్డ వద్ద ఉన్న అనిత, బాలకృష్ణలను పోలీసులు సీతారామపురం తీసుకొచ్చారు. ఇరువర్గాల కుటుంబసభ్యులతో చర్చించారు. యువతిని తమ వెంట రావాలని కుటుంబ సభ్యులు అడగ్గా ఆమె నిరాకరించి.. బాలకృష్ణ వెంట వెళ్తానని చెప్పింది. దీంతో బాలకృష్ణ స్వగ్రామమైన సింగారెడ్డి పల్లెకు ఇద్దరూ ఆటోలో బయలుదేరారు. అనిత తల్లి, సోదరులు, ఇతర బంధువులు కలసి.. సంగసానిపల్లి సమీపంలో వారు వెళుతున్న ఆటోను అడ్డగించి దాడి చేశారు. అనిత వద్ద ఉన్న పురుగు మందు తీసుకుని కుటుంబసభ్యులు ఆమె నోట్లో పోశారు.

అనుమానంతో వెనకనే వచ్చిన పోలీసులు విషయాన్ని గమనించి.. 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు యువతిని తరలించారు. ఉదయగిరి సీఐ ప్రభాకర్ రావు వైద్యశాలకు వచ్చి అనితతోపాటు సీతారాంపురం పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

ఇదీ చదవండి: గుడివాడలో చిన్నారుల అస్వస్థత...పరామర్శించిన మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.