దానా కోసం ఉపయోగించే కొబ్బరి కేక్‌ను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవడంపై డీఆర్‌ఐ అధికారులకు అనుమానం వచ్చింది. నెల్లూరు, విజయవాడకు చెందిన డీఆర్‌ఐ అధికారులు.. ఈ నెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కంటైనర్లను తనిఖీ చేశారు. కంటైనర్లలో మొదటి రెండు వరుసలు కొబ్బరి కేక్‌ను లోడ్ చేసి, మిగిలిన వరుసలను వక్కలతో లోడ్ చేశారు. దీనిని గుర్తించిన డీఆర్‌ఐ కొబ్బరి కేక్ పేరుతో చట్టవిరుద్ధంగా వక్కలను దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్నారు.
మొత్తం సరకును కిందకు తీసి పరిశీలంచారు. అందులో కేవలం 43 మెట్రిక్ టన్నులు మాత్రమే కొబ్బది కేక్ ఉండగా మిగిలిన 113 మెట్రిక్ టన్నులు వక్కలు ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా తరలించడం ద్వారా ప్రభుత్వానికి వక్కలపై చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీ రూ.3.25 కోట్లు ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించి ఇద్దరు దిగుమతిదారులపై కేసులు నమోదు చేసినట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు. గతంలో కూడా వీరు ఇదే విధానంలో 150 మెట్రిక్ టన్నులు వక్కలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని... ఆ ఇద్దరు దిగుమతిదారులను అరెస్టు చేయాల్సి ఉందని వివరించారు.
ఇదీ చదవండి: వేలం ద్వారా భూముల విక్రయానికి ప్రభుత్వం కార్యాచరణ